Corona: ఒక్క ఔషధంతో కొవిడ్‌ చికిత్స

తాజా వార్తలు

Published : 20/05/2021 10:30 IST

Corona: ఒక్క ఔషధంతో కొవిడ్‌ చికిత్స

 ఐదు రోజులు ఇంజెక్షన్‌ ఇస్తే చాలు!
 ఆస్ట్రేలియా- అమెరికా పరిశోధకుల ఘనత

సిడ్నీ:  ఒక్క ఔషధంతో కొవిడ్‌ను అడ్డుకునే దిశగా ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందమొకటి పురోగతి సాధించినట్టు తెలుస్తోంది! గ్రిఫిత్‌ యూనివర్సీటీకి చెందిన మెంజీస్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ నేతృత్వాన తయారుచేసిన ప్రత్యేక ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించగా, మంచి ఫలితాలు వచ్చాయట. ‘‘జీవ కణాల్లోకి ప్రవేశించిన వైరస్‌ అభివృద్ధి చెంది, సంతతిని పెంచుకోకుండా ఈ మందు అడ్డుకుంటుంది. ఎలుకలపై పరీక్షలు నిర్వహించగా... వైరస్‌ పార్టికల్స్‌ 99.9% మేర క్షీణించాయి. మనుషుల్లోనూ ఇదే ఫలితం వచ్చే అవకాశముంది. కరోనా బాధితులకు ఐదు రోజులపాటు నిత్యం ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వడం ద్వారా కొవిడ్‌కు అడ్డుకట్ట వేయొచ్చు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. మనుషులపై ప్రయోగ పరీక్షలు పూర్తికావడానికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించాయి. 
వైరస్‌లోని చాలా భాగాల్లో (పార్టికల్స్‌లో) కరోనాకు సంబంధించిన సమాచారమే ఉంటుంది. దాని ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ రహస్యాలను ఈ పార్టికల్స్‌ మనిషిలోని జీవకణాలకు బదిలీ చేసి, వాటిని కూడా వైరస్‌గా మార్చేందుకు తోడ్పడతాయి. పరిశోధకులు రూపొందించిన ఔషధం... ఈ వైరస్‌ భాగాలపై దాడిచేసి, షార్ట్‌/స్మాల్‌ ఇంటర్‌ఫెరింగ్‌ ఆర్‌ఎన్‌ఏ సమాచారాన్ని బదిలీ చేయకుండా వాటిని అడ్డుకుంటుందట! తద్వారా వైరస్‌ సంతతి పెరగదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి రకం కరోనా వైరస్‌కైనా ఈ సాంకేతికత పనిచేస్తుంది కాబట్టి... ఈ ఔషధం అన్నిరకాల స్ట్రెయిన్‌ల నుంచి విముక్తి పొందడానికి సహాయపడుతుందని వివరించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని