
తాజా వార్తలు
12.7లక్షల మందికి టీకా.. రాష్ట్రాలవారీ జాబితా
దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏడో రోజూ విజయవంతంగా కొనసాగినట్టు కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రోజున సాయంత్రం 6గంటల వరకు 2,28,563 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12.7లక్షల మందికి టీకా పంపిణీ జరిగినట్లు వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఇప్పటి వరకు ఏపీలో 1,27,726 మంది; తెలంగాణలో 1,02,724 మంది టీకా వేయించుకున్నారు. అత్యధికంగా కర్ణాటకలో 1,82,503 మంది టీకా వేయించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో ఏడోరోజు 267 మందిలో ప్రతికూల ప్రభావం కనిపించినట్టు కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి..
రెండో దశలో ప్రధానికి, సీఎంలకూ టీకా
Tags :