Australia: కొవిషీల్డ్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా.. అంతర్జాతీయ రాకపోకల పునరుద్ధరణకూ చర్యలు

తాజా వార్తలు

Published : 01/10/2021 14:56 IST

Australia: కొవిషీల్డ్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా.. అంతర్జాతీయ రాకపోకల పునరుద్ధరణకూ చర్యలు

వెల్లడించిన ప్రధాని స్కాట్‌ మోరిసన్‌

కాన్‌బెర్రా: భారత్‌లో అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్‌’ టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్‌నూ గుర్తించింది. దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి ‘థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్’ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం వెల్లడించారు. ఈ నిర్ణయంతో సదరు టీకాలు పొందినవారు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. దీంతోపాటు నవంబరు నుంచి స్థానికులు, శాశ్వత నివాసితులకు అంతర్జాతీయ రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు మోరిసన్‌ ప్రకటించారు. అయితే, వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు.. తిరిగొచ్చాక వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇంకా టీకా వేయించుకోనివారికి హోటల్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌ తప్పదు.

ఆంక్షలు సడలిస్తూ..

కరోనాకు ముందునాటి జీవితాలను తిరిగి పొందే విషయంలో ఆస్ట్రేలియన్లకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోరిసన్‌ వివరించారు. విదేశాలకు వెళ్లాలనుకునే ఆస్ట్రేలియన్లకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రం ఇస్తామని, ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకూ తగినట్లు ఉంటుందని వివరించారు. కరోనా కట్టడికి ఆస్ట్రేలియా మొదటినుంచి కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వీటిని నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ 80 శాతానికి చేరుకున్న నేపథ్యంలో క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. దేశ ఆదాయ వనరుల్లో ‘అంతర్జాతీయ విద్య’ కీలమైనది కావడంతో.. విద్యార్థులను తిరిగి రప్పించే పనిలో పడింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని