సీతారాం ఏచూరికి మాతృ వియోగం

తాజా వార్తలు

Published : 25/09/2021 21:33 IST

సీతారాం ఏచూరికి మాతృ వియోగం

దిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాతృమూర్తి కల్పకం ఏచూరి (88) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్యంతో నెలకొన్న అనారోగ్య సమస్యలతో దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. చిన్నతనం నుంచే ఆమె పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌కు అభిమానే కాక.. ఆమె బాటను కల్పకం తన జీవితాంతం అనుసరించారు. ఆమె మృతికి సీపీఎం సంతాపం ప్రకటించింది. ఆమె పార్థివ దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు ఆ పార్టీ తెలిపింది. కల్పకం మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి ఏప్రిల్‌లో కొవిడ్‌తో కన్నుమూశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని