అమిత్‌ షా, యోగిని చంపేస్తాం.. బెదిరింపు ఈమెయిల్‌! 
close

తాజా వార్తలు

Published : 06/04/2021 18:42 IST

అమిత్‌ షా, యోగిని చంపేస్తాం.. బెదిరింపు ఈమెయిల్‌! 

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ సీఆర్పీఎఫ్‌కు బెదిరింపు ఈ-మెయిల్‌ రావడం కలకలం రేపింది. ఇందుకోసం 11మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు ఆ ఆగంతకులు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాలు, కీలక ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెదిరింపు ఈ-మెయిల్‌ మూడు రోజుల క్రితం ముంబయిలోని సీఆర్పీఎఫ్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం. 

దీన్ని మహారాష్ట్రతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలకు పంపించినట్టు సీఆర్పీఎఫ్‌ డీజీపీ కుల్దీప్‌ సింగ్‌ వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, ఆయా సంస్థల ఆదేశాల మేరకు తాము ముందుకెళ్తామని చెప్పారు. ఇటీవల యూపీలోని పోలీస్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌  112కి కొందరు దుండగులు ఫోన్‌ చేసి 24గంటల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఏకే 47తో కాల్చి చంపుతామంటూ ఇలాగే బెదిరింపులకు పాల్పడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని