Cyclone Yaas: తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం!

తాజా వార్తలు

Updated : 22/05/2021 20:19 IST

Cyclone Yaas: తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం!

దిల్లీ: సైక్లోన్‌ యాస్ ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సైక్లోన్ తీవ్ర తుపాన్‌గా మారి మే 26న ఒడిశా, బెంగాల్‌ తీరాలను దాటొచ్చని శనివారం భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది.

‘ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తూర్పుమధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఇది మరింత బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది ఉత్తర-వాయవ్య దిశగా ప్రయాణించి, సోమవారానికి తుపానుగా మారే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. 26వ తేదీ ఉదయానికి ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుని ఆ తర్వాత తీరం దాటుతుంది’ అని వాతావరణ విభాగం వెల్లడించింది. 

కొద్ది రోజుల క్రితం తౌక్టే సైక్లోన్ పశ్చిమ తీరంపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది. దాని ప్రభావం ఉత్తర భారతంలో కూడా కనిపించింది. దాన్నుంచి కోలుకోకముందే మరో సైక్లోన్‌ సిద్ధమైంది. గతేడాది కూడా అంఫన్, నిసర్గ తుపాన్‌లు తీర ప్రాంతంపై ప్రభావం చూపించాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని