Cyclone Yaas: ప్రచండగాలులు.. భారీ వర్షాలు

తాజా వార్తలు

Updated : 26/05/2021 14:48 IST

Cyclone Yaas: ప్రచండగాలులు.. భారీ వర్షాలు

ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటిన ‘యస్‌’ తుపాను
భద్రక్‌ జిల్లా అతలాకుతలం

బాలాసోర్‌‌: ‘యస్‌’ అతి తీవ్ర తుపాను ఒడిశాలోని బాలాసోర్‌కు సమీపంలో తీరం దాటింది. ఈ మేరకు వాతావరణ విభాగం వెల్లడించింది. తుపాను వాయవ్య దిశగా కదులుతూ 3 గంటల్లో బలహీనపడనుంది. తీరాన్ని దాటే సమయంలో ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌లోని తీర ప్రాంత జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. భీకరగాలులు, భారీ వర్షాలతో ఆయా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. 

తుపాను ధాటికి పలుచోట్ల ఇళ్లు, భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గంటకు 130-155 కి.మీ వేగంతో వీచిన పెనుగాలులు ఒడిశాలోని భద్రక్‌ జిల్లాను అతలాకుతలం చేశాయి. ప్రచండ గాలుల ధాటికి కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరి పడ్డాయి. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌ తీరంలో సముద్రం బాగా ముందుకొచ్చింది. ఆ ప్రాంతంలోని సుమారు 30 గ్రామాలు సముద్రపు నీటిలో చిక్కుకున్నాయి.  తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒడిశా, బెంగాల్‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇండియన్‌ ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని