VIRUS RECOVERIES: దేశంలో ఇదే తొలిసారి!

తాజా వార్తలు

Published : 18/05/2021 16:25 IST

VIRUS RECOVERIES: దేశంలో ఇదే తొలిసారి!

న్యూదిల్లీ: కరోనా విజృంభణతో భారత్‌ సతమతమవుతోంది. నిత్యం లక్షలాది పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, గత వారం రోజులుగా కరోనా కేసుల విషయంలో స్థిరీకరణ కనిపిస్తోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో పెద్ద ఉపశమనమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో అత్యధికంగా 4లక్షలమందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఒక రోజులో ఈ స్థాయిలో కరోనా బాధితులు కోలుకోవడం దేశంలో ఇదే తొలిసారి. పాజిటివ్‌ కేసులతో పోలిస్తే అధికంగా 1.50లక్షలకు పైగా మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

తాజాగా కోలుకున్న వారితో కలిపితే మొత్తం 2.15కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో ఒక్కరోజు వ్యవధిలో 4లక్షల మందికి పైగా కోలుకోవడం ఇదే తొలిసారి అని కేంద్రం తెలిపింది. తాజాగా 4,22,436మంది రికవరీ అయ్యారని తెలిపింది. గత 14 రోజులుగా సగటున రోజుకు 3,55,944మందికి పైగా రికవరీ అవుతున్నారని వెల్లడించింది. మరోవైపు, గడిచిన 5 రోజులుగా కొత్త కేసుల కన్నా రికవరీలే భారీగా ఉన్నట్టు తెలిపింది. దేశంలో రికవరీ రేటు 85.60శాతంగా ఉన్నట్టు తెలిపింది.

ఇక మొత్తం కేసుల్లో 74.54శాతం కేసులు  పది రాష్ట్రాల్లో నమోదవడం గమనార్హం. అత్యధికంగా కర్ణాటకలో 38,603, తమిళనాడులో 33,075 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. ఇక మరణాల రేటు 1.10శాతంగా ఉండగా, గత 24 గంటల్లో 4329మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో అధ్యికంగా వెయ్యి మంది చనిపోగా, కర్ణాటకలో 476మంది కన్నుమూశారు.

ఇక ఇప్పటివరకూ 18.44 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఇచ్చారు. వ్యాక్సిన్‌ డే-122 (మే, 17)న 15,10,418 డోస్‌లను ఇచ్చారు. ఇందులో 12.67లక్షల మంది తొలి డోస్‌ తీసుకోగా, 2.43లక్షల మంది సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,52,28,996మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,15,96,512మంది రికవరీ కాగా.. 2,78,719మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 33,53,765 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని