నకిలీ టీకా కార్యక్రమం.. నటికి అస్వస్థత!

తాజా వార్తలు

Updated : 27/06/2021 10:15 IST

నకిలీ టీకా కార్యక్రమం.. నటికి అస్వస్థత!

టీకాతో ముడిపెట్టడం తొందరపాటేనన్న వైద్యులు

కోల్‌కతా: నకిలీ టీకా కార్యక్రమంలో టీకా వేయించుకున్న టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి శనివారం అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆమె అనారోగ్యానికి, నకిలీ టీకాతో ముడిపెట్టడం తొందరపాటే అవుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఓ వార్త సంస్థ వెల్లడించింది. 

కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్ కమిషనర్‌ (ఐఏఎస్ క్యాడర్‌)గా నమ్మించి దేవాంజన్ దేవ్‌ అనే వ్యక్తి మిమి చక్రవర్తిని కోల్‌కతా సమీపంలో నిర్వహించిన ఓ టీకా కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రజలకు మేలు చేసే పనికావడంతో అతడి ఆహ్వానాన్ని మన్నించి ఆమె హాజరయ్యారు. అంతేకాకుండా ప్రజలకు టీకాపై ఉన్న అనుమానాలు తొలగించేందుకు ఆమె కూడా టీకా వేయించుకున్నారు. ఆ తర్వాత అది నకిలీ కార్యక్రమమని గుర్తించి ఫిర్యాదు చేయడంతో..పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి అతడు పంపిణీ చేసిన టీకాలపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ టీకా వేయించుకున్న ఎంపీ నిన్నటివరకు బాగానే ఉన్నా.. ఈ రోజు అనారోగ్యానికి గురయ్యారు. డీహైడ్రేషన్, కడుపునొప్పి, బీపీ తగ్గిపోతుందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె పరిస్థితికి టీకానే కారణమని మాత్రం వైద్యులు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. అలాగే ఆమెకు కాలేయ సంబంధ సమస్య ఉన్నట్లు గతంలో నిర్ధారణ అయింది.

పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నకిలీ టీకా కార్యక్రమాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో సంబంధం ఉన్నవారందరిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే దేవాంజన్‌పై హత్యాయత్నం కింద కేసునమోదైంది. మరోపక్క తృణమూల్‌ నేతలతో దేవాంజన్‌ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వెలుగులోకి రావడంతో.. భాజపా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసింది. ముంబయిలో కూడా ఈ తరహా నకిలీకార్యక్రమం ఒకటి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని