Serum Institute: చిన్నపిల్లలపై సీరం వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షలకు అనుమతులు 

తాజా వార్తలు

Published : 28/09/2021 20:29 IST

Serum Institute: చిన్నపిల్లలపై సీరం వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షలకు అనుమతులు 

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో 7-11 ఏళ్ల మధ్య పిల్లలకు అందజేసేలా టీకా సిద్ధం చేసేందుకు ప్రయోగాలు మొదలుపెట్టేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు నేడు సెంటర్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నిపుణుల కమిటీ సభ్యుడు తెలిపారు. దేశంలో పాఠశాలలు పునః ప్రారంభిస్తుండటంతో ప్రభుత్వం పిల్లకు వ్యాక్సిన్‌ అందించే విషయంలో చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క భారత్‌లో పెద్దలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 87 కోట్ల డోసుల టీకాలను వేశారు. 

‘‘కమిటీలో విస్తృతంగా చర్చించిన తర్వాత 7-11 సంవత్సరాల మధ్య చిన్నారులకు ప్రొటోకాల్‌ ప్రకారం టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆమోదం తెలిపాం’’ అని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌  నిపుణుల కమిటీ సభ్యుడు తెలిపారు. 

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇప్పటికే 12-17ఏళ్ల మధ్య చిన్నారులపై ప్రయోగాలను చేపట్టింది. దీంతోపాటు తొలి 100 మందిపై నిర్వహించిన ప్రయోగాల డేటాను సంబంధిత నియంత్రణ సంస్థకు సమర్పించింది. ఇప్పటి వరకూ జైడస్‌ కాడిల్లా తయారు చేసిన డీఎన్‌ఏ టీకాకు అత్యవసర అనుమతులు లభించాయి. ఈ టీకాను 12 ఏళ్లు అంతకంటే పెద్దవారికి వినియోగించవచ్చు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని