
తాజా వార్తలు
మితృ హంతకికి మరణశిక్ష
గర్భాన్ని కోసి బిడ్డ అపహరణకు యత్నించిన లీసా మాంట్గోమెరీ
అమెరికాలో 67 ఏళ్ల తర్వాత ఓ మహిళకు అమలు ఇదే తొలిసారి
టెర్రే హౌటే (అమెరికా): స్నేహితురాలిని హత్య చేసి, గర్భాన్ని కోసి, బిడ్డను అపహరించిన నేరంలో కనాస్‌కు చెందిన మహిళ లీసా మాంట్గోమెరీ (52)కు అమెరికా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. ఇండియానా రాష్ట్రంలోని టెర్రె హౌట్ ఫెడరల్ జైలులో మంగళవారం అర్ధరాత్రి 1.31 గంటలకు (తెల్లవారితే బుధవారం) ఆమెకు అధికారులు విషపు ఇంజక్షన్ ఇచ్చారు. అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష అమలుచేయడం 67 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం.
ఎందుకీ ఉన్మాదం?
లీసా జీవితమంతా ఆవేదనల పర్వమే. పుట్టుకతోనే ఆమెకు మానసిక సమతౌల్యం అంతగా లేదు. ఆమె తల్లి గర్భధారణ సమయంలో విపరీతంగా మద్యం సేవించడమే ఇందుకు కారణమని వైద్యులు భావిస్తున్నారు. సవతి తండ్రి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 14 ఏళ్ల వయసులో ఆమె తల్లి తనను బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది. ఆ నరకం నుంచి బయటపడేందుకు 18 ఏళ్లలోనే సవతి సోదరుడుని పెళ్లి చేసుకుంది. వారికి అయిదేళ్లలో నలుగురు పిల్లలు కలిగారు. తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. కాపురం హింసాత్మకం కావడంతో విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా, గర్భం ధరించినట్టు రెండో భర్తతో తరచూ అబద్ధమాడేది. మొదటి భర్త వచ్చి ఎక్కడ నిజం చెప్పేస్తాడేమోనని భయపడేది. మానసికంగా కుంగిపోయిన ఆమె.. భర్తను నమ్మించేందుకు ఈ దురాగతానికి పాల్పడింది.
మాతృత్వం కోసమేనా ఈ దారుణం?
బాల్యం సక్రమంగా లేకపోతే ఎన్ని దారుణాలు జరుగుతాయో లీసా జీవితమే ఉదాహరణ. 2004లో ఆమె ఈ నేరానికి పాల్పడింది. అప్పట్లో ఆమెకు 36 ఏళ్లు. మిస్సోరీలోని స్కిడ్‌మోర్‌కు చెందిన 23 ఏళ్ల బాబీ జో స్టిన్నెట్ అనే 8 నెలల గర్భిణి పరిచయమయింది. ఆమెతో తానూ గర్భిణీనేనని అబద్ధమాడింది. డిసెంబరు 16న బాబీ ఇంటికి వెళ్లింది. తాడుతో బాబీ పీక నులిమి హత్య చేసింది. వంట గదిలో ఉపయోగించే చాకుతో ఆమె గర్భాన్ని కోసి ఆడ శిశువును బయటకు తీసింది. ఇంట్లోనే ఉన్న బాబీ తల్లి ఆ దారుణాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వచ్చిన పోలీసులు ఆ శిశువును తండ్రికి అప్పగించారు. ఆ పాప తండ్రి వద్ద పెరుగుతోంది. ప్రస్తుతం ఆమెకు 16 ఏళ్లు వచ్చాయి. అయితే ఆ బిడ్డ తనదేనని, ముందు రోజే తనకు ప్రసవం జరిగిందని బుకాయించింది. తరువాత విచారణలో అసలు విషయం చెప్పింది. తల్లినని అనిపించుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడింది. 2007లో ఆమెకు మరణశిక్ష ఖరారైంది.
ఇవీ చదవండి..
మళ్లీ మూలాల్లోకి!
ట్రంప్ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
