మరణమృదంగ‘మే’: గంటకు 165 మంది మృతి 

తాజా వార్తలు

Published : 02/06/2021 17:05 IST

మరణమృదంగ‘మే’: గంటకు 165 మంది మృతి 

దిల్లీ : ఎన్నడూ చూడనటువంటి కరోనా విపత్కర పరిస్థితులను భారత్‌ గత మే నెలలో చవిచూసింది. అటు ప్రజలను.. ఇటు వైద్య రంగాన్ని ఈ నెల ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే నెలలో రోజువారీ కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. ఇక మరణాల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరింది.  ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ దేశంలో నమోదు కానంతగా అత్యధిక కేసులు, మరణాలు ఇదే నెలలో భారత్‌లో వెలుగు చూశాయి. దేశంలో తొలి మరణం నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకూ చోటుచేసుకున్న మరణాల సంఖ్యలో కేవలం మే నెలలోనే 33 శాతం మరణాలు చోటుచేసుకున్నాయంటే తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే..

మే నెలలో దాదాపు 90.3 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఒక నెలలో ప్రపంచంలోనే అత్యధికంగా నమోదైన కేసులు ఇవే.
ఇక ఈ నెలలో నమోదైన మరణాల సంఖ్య దాదాపు 1.2 లక్షలు. ఏ దేశంలోనైనా ఒక నెలలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. అక్కడ ఈ ఏడాది జనవరిలో 99,680 మరణాలు చోటుచేసుకున్నాయి.
ఇక ఈ నెలలో గంటకు దాదాపు 165 మంది ప్రాణాలు కోల్పోయారు.
మే నెలలో భారత్‌లో దాదాపు ప్రతి రోజూ 3,400కుపైగా మరణాలు చోటుచేసుకోగా.. కనీసం 13 రోజులు 4 వేలకుపైగా మృతుల సంఖ్య నమోదైంది.
మే 19న రికార్డు స్థాయిలో 4,529 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే.
2020లో భారత్‌లో నమోదైన మరణాల సంఖ్య 1.48 లక్షలు. ఈ ఏడాది కేవలం ఏప్రిల్‌, మే నెలల్లో దాదాపు ఇంతే సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.
ఇక దేశ రాజధాని దిల్లీలో మరణాల రేటు మే నెలలో ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ మరణాల రేటు 2.9 శాతం కాగా.. దేశ సరాసరి(1.3 శాతం)తో పోల్చితే ఇది రెండు రెట్ల కంటే ఎక్కువ. దిల్లీలో మే నెలలో 8,090 మరణాలు చోటుచేసుకున్నాయి. దాదాపు 2.8 లక్షల కేసులు నమోదయ్యాయి.
పంజాబ్‌లో 2.8, ఉత్తరాఖండ్‌లో 2.7 శాతాలతో జాతీయ సరాసరి కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని