దీప్‌ సిద్దూకు బెయిల్‌ మంజూరు

తాజా వార్తలు

Published : 17/04/2021 12:00 IST

దీప్‌ సిద్దూకు బెయిల్‌ మంజూరు

దిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఉన్న దీప్‌సిద్దూకు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ఇటీవల ఈ కేసుపై విచారణ చేపట్టిన దిల్లీ న్యాయస్థానం తాజాగా అతడికి బెయిల్‌ మంజూరు చేసింది. రూ.30వేల పూచీకత్తు సహా షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 

‘ఆందోళన చేస్తున్న రైతుల్ని ఎర్రకోటకు వెళ్లాలని నేను పిలుపు ఇవ్వలేదు. నిరసనకు పిలుపు ఇచ్చింది రైతు సంఘాల నాయకులే. నేను రైతు సంఘాల్లో సభ్యుడిని కూడా కాదు. ఈ హింసలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నేను సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేశాను. అది నా తప్పే. కానీ ప్రతి తప్పు నేరం అయితే కాదు. నేను ఏదో వీడియో అప్‌లోడ్‌ చేసినందుకు మీడియా నా పేరును ప్రధాన నిందితుడిగా చేర్చి.. ఎందుకు ఇలా చేస్తుందో నాకు తెలియడం లేదు’ అని ఏప్రిల్‌ 8న జరిగిన విచారణలో సిద్దూ న్యాయస్థానం ముందు వెల్లడించారు.  ఎర్రకోట వద్ద హింసకు సిద్దూ జనాల్ని సమీకరించాడనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని అతడి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. 

జనవరి 26న దిల్లీలో ఉద్రిక్తకర పరిస్థితులకు దీప్‌ సిద్ధూనే కారణమని, రైతులు ఎర్రకోటవైపు వెళ్లేలా ఆయనే రెచ్చగొట్టారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని