Arjun Mk-1A: శత్రుసేనలకు ఇక చుక్కలే.. 118 భారీ యుద్ధ ట్యాంకులకు కేంద్రం ఆర్డర్‌

తాజా వార్తలు

Updated : 24/09/2021 13:01 IST

Arjun Mk-1A: శత్రుసేనలకు ఇక చుక్కలే.. 118 భారీ యుద్ధ ట్యాంకులకు కేంద్రం ఆర్డర్‌

దిల్లీ: దేశభద్రతే పరమావధిగా సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్ర రక్షణశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శత్రుసేనలను తుదముట్టించడంలో అత్యాధునిక అస్త్రమైన 118 అర్జున్‌ మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్‌ (ఎంబీటీ)లను రూ.7,523 కోట్లతో కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. అర్జున్‌ ఎంబీటీ Mk-1A ట్యాంకుల కొనుగోలుకు చెన్నై ఆవడిలో హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ (HVF)కి ఈ మేరకు ఆర్డర్‌ ఇచ్చింది. MBT MK-1A కొత్త వేరియంట్ అర్జున్‌ ట్యాంక్‌ ఫైర్‌ పవర్‌, త్వరితగతిన తరలించడం, శత్రు ట్యాంకులను ఎదుర్కోవడంతో సహా 72 ఆధునిక ఫీచర్లతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవడం దీని ప్రత్యేకత. 118 మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్‌ (MBT) అర్జున్ Mk-1A భారత సైన్యానికి సరఫరా చేసేందుకు చెన్నైలోని ఆవడిలో ఉన్న  హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (HVF)కి ఆర్డర్‌ చేసినట్టు కేంద్ర రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

రూ.7,523 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌.. రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్నివ్వడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ సాధనలో ఇదో గొప్ప ముందడుగని రక్షణశాఖ పేర్కొంది. ఈ ట్యాంకులు పగలు, రాత్రి సమయాల్లో కచ్చితంగా పనిచేయడంతో పాటు అన్ని భూభాగాల్లో  శత్రుసేనల కదలికలను గుర్తించి వారిని కట్టడి చేయడంలో కీలకంగా పనిచేయగలవని తెలిపింది. ప్రస్తుతం భారత సైన్యం వినియోగిస్తున్న అర్జున్‌ MBTని అప్‌గ్రేడ్‌ చేస్తూ అధునాతన ఫీచర్లతో దేశ రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దీన్ని అభివృద్ధి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ అర్జున Mk-1A ట్యాంక్‌ని ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణెకు చెన్నైలో అందించిన విషయం తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని