దిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్‌
close

తాజా వార్తలు

Updated : 25/04/2021 13:47 IST

దిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్‌

ప్రకటించిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రకటించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటం.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి దయనీయ పరిస్థితులు తలెత్తుతుండటంతో వారం రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ను మరో వారం పెంచారు. 

దిల్లీలో కరోనా విజృంభిస్తుంటంతో ఈనెల 19వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 5 గంటల వరకు వారం రోజుల పాటు పూర్థిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించపోతే రానున్న రోజుల్లో భయంకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రజలు భయపడవద్దని, జాగ్రత్తలు వహించాలని సూచించారు.

దిల్లీలోని కరోనా ఆసుపత్రుల్లో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆక్సిజన్‌ కొరత ఏర్పడి పదుల సంఖ్యలో రోగులు మృతిచెందుతున్నారు. రాజధానిలోని జైపూర్‌ గోల్డెన్‌ ఆసుపత్రిలో ప్రాణవాయువు అందక శుక్రవారం రాత్రి 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన సర్‌ గంగారామ్‌లో ఆక్సిజన్‌ సరిపడా లేక గురువారం 25 మంది మరణించారు. తమ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు పడిపోయాయని, సాయమందించాలని పలు ఆసుపత్రుల యాజమాన్యాలు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి అత్యవసర సందేశం (ఎస్‌ఓఎస్‌) పంపుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దిల్లీలో 24 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో అత్యధికంగా 357 మంది రోగులు మృత్యువాతపడ్డారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని