‘మీరు అనాథలు కాదు.. నేనింకా బతికే ఉన్నా’
close

తాజా వార్తలు

Published : 15/05/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మీరు అనాథలు కాదు.. నేనింకా బతికే ఉన్నా’

అండగా నిలుస్తామన్న కేజ్రీవాల్‌ సర్కారు

దిల్లీ: కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు దిల్లీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం వెల్లడించారు. అంతేగాక, కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు. 

‘‘మహమ్మారి కారణంగా ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోతున్నారు. వారికి నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు అనాథలని బాధపడకండి. మీకు నేనున్నాను. అనాథలైన పిల్లల చదువులు, భవిష్యత్తును ప్రభుత్వమే చూసుకుంటుంది’’ అని కేజ్రీవాల్‌ ఆన్‌లైన్‌ మీడియా సమావేశంలో తెలిపారు. ‘‘పిల్లలను కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ వారు పిల్లలపైనే ఆధారపడ్డారు. అలాంటి వారికి పెద్ద కొడుకు(కేజ్రీవాల్‌) ఇంకా బతికే ఉన్నాడు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుంది’’ అని సీఎం చెప్పుకొచ్చారు. అయితే ఈ వయసులో ఆ పెద్దవాళ్లకు ఆర్థిక అండతో పాటు ఆదరణ, అభిమానం కూడా కావాలని కేజ్రీవాల్‌ అన్నారు.  

దిల్లీలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ లాక్‌డౌన్‌ విధించారు. దీంతో కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని సీఎం తెలిపారు. తాజాగా 24 గంటల్లో కేసుల సంఖ్య 10వేల దిగువకు పడిపోయిందని, నిన్న దిల్లీలో 8500 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు. గతంలో పోలిస్తే ఆక్సిజన్‌ అవసరం, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా తగ్గుతుందని వెల్లడించారు. 

కాగా.. కరోనాతో అనాథలైన చిన్నారులను ఆదుకోవడం కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అలాంటి పిల్లలకు నెలకు రూ. 5వేల పింఛనుతో పాటు ఉచిత విద్యను అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ నిన్న ప్రకటించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని