దిల్లీలో స్కూళ్లకు ప్రత్యేక బోర్డు

తాజా వార్తలు

Published : 06/03/2021 20:13 IST

దిల్లీలో స్కూళ్లకు ప్రత్యేక బోర్డు

దిల్లీ: స్కూళ్ల విషయంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఉన్న పాఠశాలలన్నింటినీ ఒకే బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో కొత్త స్కూల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న దాదాపు 2,700 స్కూళ్లు కొత్తగా ఏర్పాటు చేయబోయే దిల్లీ బోర్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (డీబీఎస్‌ఈ) పరిధిలోకి రానున్నాయి. 2021-22లో తొలుత ప్రభుత్వ స్కూళ్లు.. రాబోయే నాలుగైదేళ్లలో మిగతా అన్ని స్కూళ్లూ ఈ బోర్డులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం వెల్లడించారు.

ప్రస్తుతం దిల్లీ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు, 1700 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కూల్‌ బోర్డుకు పాలకమండలి అధ్యక్షుడిగా దిల్లీ విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ బాడీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నేతృత్వం వహించనున్నారని కేజ్రీవాల్‌ తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం, నిస్వార్థంగా దేశానికి, సమాజానికి సేవ చేయాలనే దృక్పథం అలవాటు చేయాలన్నదే డీబీఎస్‌ఈ లక్ష్యమని వివరించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని