Corona: దిల్లీలో 89 కేసులు ..
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 04:11 IST

Corona: దిల్లీలో 89 కేసులు ..

దిల్లీ: దేశ రాజధాని దిల్లీని గడగడలాడించిన కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజు కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,128 మందికి పరీక్షలు నిర్వహించగా.. 89 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇదే అత్యల్పం. పాజిటివిటీ రేటు కూడా దిగివస్తోంది. ప్రస్తుతం 0.16 శాతానికి పడిపోయింది. కరోనా మొదలైనప్పటి నుంచి హస్తినలో ఇదే అత్యల్పం. యాక్టివ్‌ కేసులు కూడా 2000 దిగువకు వచ్చాయి. ప్రస్తుతం 1996 యాక్టిక్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. రికవరీ రేటు 98.12 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు దిల్లీలో 14,32,381 మందికి కొవిడ్‌ సోకగా.. అందులో 14,05,460 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 11 మంది మరణించగా.. మొత్తంగా 24,925 మంది కన్నుమూశారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ అదుపులోకి వస్తున్నప్పటికీ.. మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కష్టకాలంలో వైద్యులకు సహాయపడేందుకు వీలుగా 5000 మంది యువకులకు హెల్త్‌ అసిస్టెంట్లుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం వెల్లడించారు. కరోనా రెండు దశల్లోనూ మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బంది కొరత కనబడిందని, అందువల్ల వైద్యులు/నర్సులకు తోడ్పాటునందించేందుకు ఐదువేల మంది సహాయకులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వీరందరికీ దిల్లీలోని తొమ్మిది ప్రముఖ వైద్య సంస్థల్లో రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని