Positivity Rate: దిల్లీలో 3.58 శాతం దిగువకు..

తాజా వార్తలు

Published : 22/05/2021 17:20 IST

Positivity Rate: దిల్లీలో 3.58 శాతం దిగువకు..

దిల్లీ: కరోనా రెండో దశ విజృంభణతో అతలాకుతలమైన దేశ రాజధాని దిల్లీ క్రమంగా కోలుకుంటోంది. ఏప్రిల్‌లో దాదాపు 36 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు తాజాగా 3.58 శాతానికి తగ్గడం విశేషం. ఏప్రిల్‌ 1 నుంచి ఇదే అతి తక్కువ పాజిటివిటీ రేటు. దిల్లీలో శుక్రవారం 2,260 కేసులు నమోదయ్యాయి. మార్చి 31 తర్వాత ఇంత  తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే మరణాలు మాత్రం అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే  182 మంది మృతిచెందారు. 

దిల్లీలో ప్రస్తుతం 31,308 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. రికవరీ రేటు 96.16 శాతానికి పెరిగింది. 6,453 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నమోదైన పాజిటివ్‌ కేసులకంటే ఇది మూడు రెట్లు అధికం. పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉంటే సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కేసులు తగ్గుతున్నప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని కేజ్రీవాల్‌ సర్కారు ప్రజలకు సూచిస్తోంది. కేసులు తగ్గుతున్నా.. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. లాక్‌డౌన్‌ విధించడం వల్లే సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్టు వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని