కరోనా ఉద్ధృతి.. కేజ్రీవాల్‌ మరో కీలక నిర్ణయం

తాజా వార్తలు

Published : 09/04/2021 21:19 IST

కరోనా ఉద్ధృతి.. కేజ్రీవాల్‌ మరో కీలక నిర్ణయం

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని అన్ని పాఠశాలల్ని మూసివేయనున్నట్టు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడే ఉంటాయని స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేశారు. 
 దిల్లీలో ఏప్రిల్‌ 30 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ మంగళవారం సీఎం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అక్కడ గురువారం ఒక్కరోజే 7400లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,98,005కి చేరింది. వీటిలో 6,63,667మంది కోలుకోగా, 11,157 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 23,181 క్రియాశీల కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95 శాతంగా ఉంటే, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.

మరోవైపు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రేపట్నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై ఆదేశించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని