delhi:ప్రైవేటు ఆసుపత్రులకు టీకాలెక్కడివి..?

తాజా వార్తలు

Published : 29/05/2021 16:45 IST

delhi:ప్రైవేటు ఆసుపత్రులకు టీకాలెక్కడివి..?

కేంద్రాన్ని ప్రశ్నించిన దిల్లీ ప్రభుత్వం

దిల్లీ: 18 నుంచి 44 ఏళ్లవారికి వేసేందుకు కరోనా టీకాలు అందుబాటులో లేవని శనివారం దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అలాగే రాష్ట్రాలకు ఇచ్చేందుకు లేని టీకాలు.. ప్రైవేటు ఆసుపత్రులకు ఎలా చేరుతున్నాయో అంటూ దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా విమర్శించారు. ఈ వయస్సు వారికి టీకాలు అందుబాటులో లేకపోవడంతో.. అక్కడి ప్రభుత్వం టీకాలు వేసే ప్రక్రియను గతవారం నిలిపివేసింది. 

శనివారం మనీశ్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం టీకా పంపిణీ వ్యవస్థను సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు. ఒకవైపు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు తగినంత స్టాక్‌ లేదని చెప్తుండగా, ప్రైవేటు ఆసుపత్రులకు టీకాలు ఎలా అందుబాటులో ఉంటున్నాయని ప్రశ్నించారు. ‘18-44 ఏళ్లవారికి జూన్‌లో టీకాలు అందుబాటులో ఉంటాయని కేంద్రం రాష్ట్రాలకు వెల్లడించింది. కానీ జూన్ 10లోపు అవి మాకు చేరేలా లేవు’ అని ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే రానున్న రోజుల్లో ఆ వయస్సు వారికి 5.5లక్షల డోసులు లభ్యం కానున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. 10 మిలియన్ల డోసుల టీకాలను సేకరించేందుకు ఆప్‌ ప్రభుత్వం బిడ్డర్లను ఆహ్వానించింది. జూన్ ఏడులోగా తమ ఆసక్తిని తెలియపరచాలని టీకా పంపిణీ సంస్థలను కోరింది.  

దేశరాజధానిలో వెయ్యిలోపు కేసులు..

దిల్లీలో రోజురోజుకూ కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు 1,000కి దిగువన నమోదయ్యాయి. రెండోదశ కరోనా ఉద్ధృతిలో మొదటిసారి ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 956 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రోజురోజుకు కొత్త కేసులు తగ్గుతుండటంతో దిల్లీ ప్రభుత్వం అన్‌లాకింగ్‌కు మొగ్గుచూపింది. సోమవారం ఉదయం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు. కొవిడ్ మరింత తగ్గుముఖం పడితే మరిన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు చెప్పారు.  

 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని