Delhi: రెస్టారెంట్లు, మార్కెట్‌లకు అనుమతి
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 18:22 IST

Delhi: రెస్టారెంట్లు, మార్కెట్‌లకు అనుమతి

న్యూదిల్లీ: కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ దాదాపు కుదుటపడింది. లాక్‌డౌన్‌ సహా, ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి దిల్లీలో మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 14వ తేదీ నుంచి రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని అయితే, 50శాతం సామర్థ్యంతోనే వాటిని నడపాలని అన్నారు. అదే విధంగా మున్సిపల్‌ జోన్స్‌లో వారాంతపు మార్కెట్‌లకు కూడా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇవి కాకుండా పాఠశాలలు, కాలేజ్‌లు, విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, సినిమా హాళ్లు, మల్టీపెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, వ్యాయామశాలలు, పార్కులను ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ మూసే ఉంచాలని ఆదేశించారు. నగరంలోని ఆధ్యాత్మిక కేంద్రాలను తెరుచుకోవచ్చని, అయితే సందర్శకులకు అనుమతి ఇవ్వరాదని అన్నారు. మార్కెట్లు, మాల్స్‌ సరి, బేసి విధానంలో మాత్రమే తెరిచి ఉంచాలని పేర్కొన్నారు.

* ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్‌-ఏ అధికారులు 100శాతం హాజరు కావాలి. మిగిలిన వాళ్లు 50శాతం విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.

* ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే పనిచేయాలి.

* వివాహాలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల్లో 20మందికి మించి ఉండరాదు.

* దిల్లీ మెట్రో, బస్సులు 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో పనిచేస్తాయి.

* ప్రజా రవాణా ఆటోలు, ఇ-రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్స్‌లలో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి. మ్యాక్సీ క్యాబ్‌లో 5గురు, ఆర్‌టీవీలో 11మంది ప్రయాణించవచ్చు.

* అంతరాష్ట్రాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణాలకు ఎలాంటి నిబంధనలు లేవు. ప్రత్యేక అనుమతులు, ఇ-పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని