గంగారాం ఆస్పత్రిలో మరోసారి ఎమర్జెన్సీ!

తాజా వార్తలు

Published : 25/04/2021 10:23 IST

గంగారాం ఆస్పత్రిలో మరోసారి ఎమర్జెన్సీ!

ఆగమేఘాల మీద 5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఏర్పాటు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ నిల్వలు తగ్గిపోతుండటంతో శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆస్పత్రి అధికారులు ప్రభుత్వానికి అత్యవసరం సందేశం (ఎస్‌ఓఎస్‌) పంపారు. అప్పటికి కేవలం గంటకి సరిపడా ప్రాణవాయువు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. 130 మంది రోగులు ఐసీయూలో ఉన్నారని.. మరో 30 మంది వెంటిలేటర్‌పై ఉన్నారని ఈ సందేశంలో పేర్కొన్నారు.

దీంతో అప్రమత్తమైన స్థానిక ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్దా అధికారులతో మాట్లాడి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను తెప్పించారు. అర్ధరాత్రి 12:20 గంటల సమయంలో ఒక మెట్రిక్‌ టన్ను ఆక్సిజన్‌ ఆస్పత్రికి చేరుకుంది. అది రెండు గంటలకు సరిపోతుందని ఆస్పత్రి అధికార ప్రతినిధి 12:45 గంటల సమయంలో తెలిపారు. వాస్తవానికి గంగారాం ఆస్పత్రికి ఫరీదాబాద్‌లోని ఒక పంపిణీదారుడు ఆక్సిజన్ అందించాల్సి ఉంది. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ట్యాంకర్లు ఆస్పత్రికి చేరాల్సింది. కానీ, ఉదయం 4:15 గంటల సమయంలో 5 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఆస్పత్రికి వచ్చాయి. గత మూడు రోజుల్లో ఆస్పత్రికి అందిన భారీ ఆక్సిజన్‌ నిల్వలు ఇవే. ఇది 11-12 గంటలకు సరిపోతుందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చాలా రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు ఆక్సిజన్ అందించగలుగుతున్నామని తెలిపారు.

రెండు రోజుల క్రితం సైతం గంగారాం ఆస్పత్రిలో ఇదే పరిస్థితి తలెత్తింది. తమ వద్ద మరో రెండు గంటలకు సరిపడా ప్రాణవాయువు మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే 60 మంది రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆస్పత్రి వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దాంతో ఆగమేఘాల మీద కదిలిన యంత్రాంగం రెండు గంటల్లోపు ఆసుపత్రికి రెండు ఆక్సిజన్‌ ట్యాంకర్లను పంపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని