close

తాజా వార్తలు

Updated : 04/03/2021 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఆమెను పెళ్లాడుతావా’?వ్యాఖ్యపై వివరణ

సమర్పించిన పత్రాల ఆధారంగా ప్రశ్నించినట్టు సుప్రీంకోర్టు వర్గాల వివరణ

దిల్లీ: బాలికపై అత్యాచారం జరిగిన కేసులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం నిందితుణ్ని అడిగిన ప్రశ్నపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్గాలు వివరణ ఇచ్చాయి. అత్యాచారం జరిగిన సమయంలో ఆ బాలిక బంధువులకు నిందితుడు రాసి ఇచ్చిన పత్రాల ఆధారంగా ఈ ప్రశ్న వేసినట్టు తెలిపాయి. తనపై కేసు పెట్టకుండా ఉంటే బాలికకు వివాహ వయసు వచ్చిన తరువాత పెళ్లాడుతానంటూ రాసిచ్చాడని, ఆ పత్రాన్ని చదివిన ధర్మాసనం వివాహం చేసుకోవడం ఇష్టమేనా అని ప్రశ్నించిందని పేర్కొంది. ఆ పత్రాన్ని చూస్తూ విచారణ ప్రారంభించిన ధర్మాసనం తొలుత ఆ ప్రశ్న వేసిందని వివరించింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని