close

తాజా వార్తలు

Updated : 15/04/2021 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీట్‌ పీజీ పరీక్షల వాయిదా కోరుతూ పిటిషన్‌

సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైద్యుల బృందం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో నీట్‌ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తొమ్మిది మంది ఎంబీబీఎస్‌ వైద్యుల బృందం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. కొవిడ్‌ రోగులకు రోజూ చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది భౌతికంగా జరుగుతున్న ఈ పరీక్షకు హాజరైతే వేలాది మంది జీవితాలకు ప్రమాదకరమని పిటిషనర్‌ పేర్కొన్నారు.  అందువల్ల నీట్‌ పీజీ మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఇటీవల సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రద్దుచేయడం, మే 4నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ నెల 18న నీట్‌ పీజీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని