ట్రంప్‌ తానే గెలిచాననుకుంటున్నారు: లారా

తాజా వార్తలు

Published : 06/01/2021 23:40 IST

ట్రంప్‌ తానే గెలిచాననుకుంటున్నారు: లారా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ తానే విజయం సాధించానని భావిస్తున్నారని ఆయన కోడలు, ప్రచార సలహాదారు లారా ట్రంప్‌ వెల్లడించారు. ఒకవేళ జనవరి 20 నుంచి జో బైడెన్‌ అధ్యక్ష పగ్గాలు చేపడితే.. డొనాల్డ్‌ ట్రంప్‌ 2024 ఎన్నికల్లో తిరిగి పోటీలో ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. బైడెన్‌ గెలుపును ధ్రువీకరిస్తూ బుధవారం కాంగ్రెషనల్‌ ఓట్‌ జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంపే విజయం సాధించారని మేం భావిస్తున్నాం. ఒకవేళ ఆయన వచ్చే నాలుగు సంవత్సరాలు పదవిలో లేకపోతే.. 2024లో తిరిగి ఎన్నికల బరిలో నిలిచే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాం’ అని లారా తెలిపారు. 

డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా తాను అధ్యక్షుడిగా గెలిచానని భావిస్తున్నారా? అని విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ.. ‘అవును ట్రంప్‌ ఎన్నికల్లో తానే గెలిచినట్లు భావిస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది ఆయనతో ఏకీభవించారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. ఈ విషయాన్ని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. ఎందుకంటే అది కేవలం ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవడానికి సంబంధించిన విషయం కాదు. మొత్తం అమెరికా ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం కలిగించే వ్యవహారమిది’ అని లారా ట్రంప్‌ స్పష్టం చేశారు.  

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ విజయాన్ని ఇప్పటికే ఎలక్టోరల్‌ కాలేజీ ధ్రువీకరించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్‌ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం అయింది. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లలో ఆయనకు 306 ఓట్లు రాగా.. ప్రత్యర్థి ట్రంప్‌నకు 232 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

ఇదీ చదవండి

బర్డ్‌ ఫ్లూ: రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని