స్పుత్నిక్‌ వి టీకా సురక్షితమే: రెడ్డీస్‌ ల్యాబ్స్‌

తాజా వార్తలు

Published : 11/01/2021 23:59 IST

స్పుత్నిక్‌ వి టీకా సురక్షితమే: రెడ్డీస్‌ ల్యాబ్స్‌

దిల్లీ: రష్యాకు చెందిన కరోనా వైరస్‌ స్పుత్నిక్‌ వి టీకా సురక్షితమేనని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ పేర్కొంది. భారత్‌లో స్పుత్నిక్‌ టీకా మిడ్‌ స్టేజ్‌ ట్రయల్స్‌ ఆధారంగా.. స్వతంత్ర నిపుణుల బోర్డు ఈ విషయాన్ని వెల్లడించిందని ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ సంస్థ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘స్పుత్నిక్‌ వి కరోనా వైరస్‌ టీకా సురక్షితమే. టీకా మిడ్‌ స్టేజ్‌ ట్రయల్స్‌లో ఉండగా.. స్వతంత్ర నిపుణుల బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా మరో దశ ట్రయల్స్‌ కొనసాగించేందుకు స్వతంత్ర బోర్డు సిఫారసు చేసింది. దీంతో టీకా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని సమీక్ష, అనుమతి కోసం డీసీజీఐకి దరఖాస్తు చేశాం’ అని రెడ్డీస్‌ ల్యాబ్‌‌ వెల్లడించింది. 

ఇదీ చదవండి

స్పుత్నిక్‌ టీకా: 95శాతం సమర్థవంతంగా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని