Drugs Case: అనన్య.. ఇదేం సినిమా షూటింగ్‌ కాదు లేటుగా రావడానికి!

తాజా వార్తలు

Updated : 23/10/2021 11:07 IST

Drugs Case: అనన్య.. ఇదేం సినిమా షూటింగ్‌ కాదు లేటుగా రావడానికి!

ముంబయి: బాలీవుడ్‌ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న క్రూయిజ్‌ నౌకపై డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో నటి అనన్య పాండే శుక్రవారం కూడా ఎన్‌సీబీ విచారణకు హాజరయ్యారు. అయితే అధికారులు ఇచ్చిన సమయం కంటే అనన్య మూడు గంటలు ఆలస్యంగా ఆఫీస్‌కు వచ్చారు. దీంతో ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్ సమీర్‌ వాంఖడే ఆమెను గట్టిగానే మందలించినట్లు దర్యాప్తు సంస్థ వర్గాల సమాచారం. 

బాలీవుడ్ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ వాట్సప్‌లో జరిపిన డ్రగ్స్‌ చాటింగ్‌లో అనన్య పేరు రావడంతో గత గురువారం ఎన్‌సీబీ అధికారులు ఆమె నివాసంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విచారణ ఎదుట హాజరుకావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేశారు. గురువారం 2 గంటల పాటు ఆమెను విచారించిన సమీర్‌ వాంఖడే.. శుక్రవారం ఉదయం 11 గంటలకు మళ్లీ రావాలని తెలిపారు. అయితే అనన్య మాత్రం నిన్నటి విచారణకు మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్యాలయానికి వచ్చారు. దీంతో సమీర్‌ ఆమెపై కోప్పడినట్లు ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఇదేం సినిమా షూటింగ్‌, ప్రొడక్షన్‌ హౌజ్‌ కాదు.. కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయం. ఇకపై ఇచ్చిన సమయానికే విచారణకు రావాలి’’ అని ఆయన గట్టిగా చెప్పినట్లు తెలిపాయి.

శుక్రవారం దాదాపు 4 గంటల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు. వాట్సాప్‌ చాటింగ్‌లో ఆర్యన్‌తో డ్రగ్స్‌ గురించి చేసిన సంభాషణపై వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆమె డ్రగ్స్‌ తీసుకోవడం లేదా ఆర్యన్‌ వాటిని పొందడానికి సహకరించడం వంటి విషయాలపై ఆరా తీసినట్లు సమాచారం. అయితే అనన్య వాటిని ఖండించినట్లు తెలుస్తోంది. తాను ఎప్పుడూ మాదక ద్రవ్యాలను తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయడంలో సాయం చేయలేదని అనన్య చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో సోమవారం మళ్లీ విచారణకు రావాలని అధికారులు ఆమెను ఆదేశించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని