close

తాజా వార్తలు

Published : 05/03/2021 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు 

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. మార్చి 15న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అధికారులు ఆమెకు సూచించారు.

మెహబూబా ముఫ్తీ 2016 నుంచి 2018 వరకు జమ్మూకశ్మీర్‌ సీఎంగా పనిచేశారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దుచేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని వ్యతిరేకించిన ఆమె గృహనిర్బంధానికి గురయ్యారు. దాదాపు 14 నెలల తర్వాత గతేడాది అక్టోబర్‌లో నిర్బంధం నుంచి బయటకు వచ్చారు. అనంతరం కశ్మీర్‌లో తన రాజకీయ ప్రత్యర్థి అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, తదితర పక్షాలతో కలిసి పీపుల్స్‌ ఆలియన్స్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌లో చేరారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని