Encounter: లష్కరే కమాండర్‌ హతం

తాజా వార్తలు

Updated : 14/07/2021 11:34 IST

Encounter: లష్కరే కమాండర్‌ హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన వారిలో పాకిస్థాన్​కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. మరింత మంది ముష్కరులు ఉన్నారన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని