ఆంగ్లమాధ్యమం కేసు విచారణ వాయిదా

తాజా వార్తలు

Published : 16/02/2021 14:01 IST

ఆంగ్లమాధ్యమం కేసు విచారణ వాయిదా

దిల్లీ: ఆంగ్ల మాధ్యమం కేసు విచారణ సుప్రీంకోర్టులో  వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి  చేస్తూ తెచ్చిన జీవోలు 81, 85లను హైకోర్టు  రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే,  ముఖ్యమైన కేసు విచారణ ఉండటంతో ఆంగ్ల మాధ్యమం కేసు విచారణ వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే తెలిపారు. తదుపరి విచారణ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని