ఏమాత్రం బరువు పెరిగినా Corona ముప్పే!
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 08:02 IST

ఏమాత్రం బరువు పెరిగినా Corona ముప్పే!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ చిన్న జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా వైరస్‌ సోకిందేమోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు. తొలిదశ వ్యాప్తితో పోల్చుకుంటే రెండోదశలో మహమ్మారి లక్షణాలు భిన్నంగా కనిపిస్తుండటం కూడా దీనికి ఒక కారణమే. ఎలాంటి లక్షణాలు లేనివారికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో ఇటీవల బ్రిటన్‌ శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధన తేల్చిన విషయాలు మరింత భయం పుట్టిస్తున్నాయి. 40 ఏళ్ల లోపు వయస్సు వారి శరీర ద్రవ్యరాశి సూచిక (బాడీ మాస్‌ ఇండెక్స్‌-బీఎంఐ) విలువ ఉండాల్సిన దానికంటే ఏమాత్రం ఎక్కువ ఉన్నా వారికి కరోనా ముప్పు అధికంగా పొంచి ఉంటుందని పరిశోధనలో  వెల్లడైంది.

సాధారణంగా బీఎంఐ విలువ 23 కంటే తక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అంతకుమించి ఒక్కపాయింట్‌ పెరిగినా ప్రమాదమే. అలాంటి వారికి వైరస్‌ సోకితే అస్పత్రిలో అత్యవస చికిత్స చేయించుకునే అవసరం 5శాతం ఎక్కువగానూ, ఇంటెన్సివ్‌ కేర్‌లో చేరే అవకాశాలు 10శాతం వరకు ఎక్కువగా ఉంటాయని సర్వేలో తేలింది. దీనిప్రభావం 40 ఏళ్లలోపు ఉన్న వారిపై అధికంగా ఉంటుంది. దాదాపు 7 మిలియన్ల మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించినట్లు ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మేరకు ప్రముఖ జర్నల్‌ లాన్‌సెట్‌ డయాబెటిక్స్ అండ్‌ ఎండోక్రైనాలజీలో కథనం ప్రచురితమైంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని