గడ్డు పరిస్థితులకు సిద్ధంగా ఉండండి: ట్రంప్‌
close

తాజా వార్తలు

Published : 01/04/2020 11:27 IST

గడ్డు పరిస్థితులకు సిద్ధంగా ఉండండి: ట్రంప్‌

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విలయతాండవమే చేస్తోంది. గడుస్తున్న ఒక్కోరోజు ఆ దేశ చరిత్రలో చీకటి దినంగా మిగిలిపోతోంది. ‘జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ’ సేకరించిన సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం 8.30గంటల నుంచి మంగళవారం సాయంత్రం 8.30గంటల మధ్య అంటే 24 గంటల్లో 856 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. దీంతో ప్రస్తుతం అక్కడి మృతుల సంఖ్య 3,896కు చేరింది. చైనా అధికారిక మరణాల సంఖ్యను మంగళవారం సాయంత్రానికే అమెరికా అధిగమించేసింది. మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా వ్యాప్తిని బట్టి చూస్తే మరికొన్ని గంటల్లో ఇది రెండు లక్షలకు చేరడం ఖాయమనిపిస్తోంది. అయితే వీరిలో కేవలం 7,082 మంది మాత్రమే కోలుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా మహమ్మారిని ఓ పీడగా అభిర్ణించిన అధ్యక్షుడు ట్రంప్‌ ఈ రెండు వారాలు అత్యంత బాధాకరంగా గడవనున్నాయని అభిప్రాయపడ్డారు. మరికొన్ని రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు రానున్నాయని.. ఎదుర్కోవడానికి ప్రతిపౌరుడు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు అద్భుతం సృష్టించే మందేమీ లేదని.. కేవలం మన వ్యవహార శైలితోనే దీన్ని తరిమికొట్టగలమని గుర్తుచేశారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. రానున్న 30 రోజులు అత్యంత కీలకమని గుర్తుచేశారు. 

మరోవైపు భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ మంగళవారం సాయంత్రం అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియోతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల్లో కొవిడ్‌-19 పరిస్థితిపై వీరు చర్చించారు. మహమ్మారిని ఓడించేందుకు ఇరు దేశాల పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.

ఇవీ చదవండి..

పెను సంక్షోభమే ఎదుర్కోబోతున్నాం: ఐరాస
వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని