ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ‘సర్కోజీ’కి జైలు శిక్ష!
close

తాజా వార్తలు

Published : 01/03/2021 22:19 IST

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ‘సర్కోజీ’కి జైలు శిక్ష!

అవినీతి కేసులో దోషిగా తేల్చిన పారిస్‌ కోర్టు

పారిస్‌: అవినీతి ఆరోపణల కేసులో ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీకి(62) చుక్కెదురైంది. ఓ కేసులో సర్కోజీ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో దోషిగా తేల్చిన పారిస్ న్యాయస్థానం, ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్రాన్స్‌ చరిత్రలోనే ఓ మాజీ అధ్యక్షుడు అవినీతి కేసును ఎదుర్కోడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

నికోలస్‌ సర్కోజీపై ఉన్న కేసు విచారణకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా సంపాదించేందుకు న్యాయమూర్తిని సర్కోజీ ప్రలోభపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, సర్కోజీ తన హోదాను ఉపయోగించి న్యాయమూర్తిపై ఒత్తిడి తెచ్చారని తేచ్చింది. ఇందుకోసం న్యాయమూర్తికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారని కూడా వెల్లడించింది. దీంతో సర్కోజీతో పాటు మరో ఇద్దరిని దోషిగా తేల్చిన న్యాయస్థానం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

ఇదిలాఉంటే, 2007-2012 మధ్యకాలంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా పనిచేసిన సర్కోజీపై మరో కేసు కూడా విచారణలో ఉంది. అధ్యక్ష ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సర్కోజీతో పాటు మరో 13మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసు వచ్చే నెల విచారణ వచ్చే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని