Sputnik Light: స్పుత్నిక్‌ లైట్‌ పరీక్షలకు బ్రేక్‌

తాజా వార్తలు

Updated : 01/07/2021 12:35 IST

Sputnik Light: స్పుత్నిక్‌ లైట్‌ పరీక్షలకు బ్రేక్‌

దిల్లీ: కరోనా టీకా స్పుత్నిక్‌ లైట్ మూడో దశ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించేందుకు ఔషధ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌కు నిపుణుల బృందం అనుమతి నిరాకరించింది. దేశంలో ప్రయోగపరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ రెడ్డీస్‌ చేసిన దరఖాస్తుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం బుధవారం చర్చించింది. అనంతరం స్పుత్నిక్‌ లైట్ తుది పరీక్షలను నిర్వహించడానికి అనుమతి నిరాకరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ ఒక్క డోసు టీకా. స్పుత్నిక్‌-వి రూపకర్తలే దీన్ని కూడా సిద్ధం చేశారు. దీన్ని భారత్‌లోకి తీసుకువచ్చేందుకు రెడ్డీస్ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే దీని ధర రూ.730గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ టీకా అందుబాటులోకి వస్తే, మన దేశ టీకా కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తుందని రెడ్డీస్ సంస్థ ఇదివరకే వెల్లడించింది. అలాగే ఒక్కడోసుతో 80 శాతం సామర్థ్యాన్ని ఇస్తుందని తెలిపింది. మరోపక్క కరోనా చికిత్సలో మెరుగైన పనితీరు కనబరుస్తోన్న 2-డీజీ ఔషధాన్ని వాణిజ్యపరంగా విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెడ్డీస్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని