Facebook: పార్లమెంటరీ ప్యానల్‌ ముందుకు ఫేస్‌బుక్‌

తాజా వార్తలు

Published : 29/06/2021 17:35 IST

Facebook: పార్లమెంటరీ ప్యానల్‌ ముందుకు ఫేస్‌బుక్‌

దిల్లీ: సామాజిక మాధ్యమాల దుర్వినియోగం విషయంలో తమ అభిప్రాయాలు, వివరణ ఇచ్చేందుకు ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ భారత ప్రతినిధులు నేడు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ(ఐటీ) ముందు హాజరయ్యారు. ఫేస్‌బుక్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ శివనాథ్‌, జనరల్‌ కౌన్సిల్‌ నమ్రతా సింగ్‌ కమిటీ ముందుకొచ్చారు. 

పౌరుల హక్కుల పరిరక్షణ, సోషల్‌మీడియా దుర్వినియోగాన్ని అరికట్టే అంశాలపై చర్చించేందుకు ఇటీవల పార్లమెంటరీ కమిటీ ఫేస్‌బుక్‌, గూగుల్‌ సంస్థలకు నిన్న సమన్లు జారీ చేసింది. అయితే కొవిడ్‌ ప్రొటొకాల్‌ దృష్ట్యా తమ ప్రతినిధులు వ్యక్తిగతంగా కమిటీ ఎదుట హాజరయ్యేందుకు కంపెనీ పాలసీ అంగీకరించదని ఫేస్‌బుక్‌ తెలిపింది. దీనికి కమిటీ ఛైర్మన్‌, ఎంపీ శశిథరూర్‌ స్పందిస్తూ.. పార్లమెంట్‌ సెక్రటేరియట్‌లో వర్చువల్‌ సమావేశాలకు అనుమతి లేనందున వ్యక్తిగతంగానే హాజరుకావాలని స్పష్టం చేశారు.  

సోషల్‌మీడియా దుర్వినియోగంపై ట్విటర్‌ ప్రతినిధులు కూడా ఇటీవల కమిటీ ఎదుట హాజరయ్యారు. రాబోయే వారాల్లో యూట్యూబ్‌, ఇతర సామాజిక మాధ్యమాలకు కూడా సమన్లు జారీ చేయనున్నట్లు కమిటీ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని