26న భారత్‌ బంద్‌

తాజా వార్తలు

Updated : 11/03/2021 13:40 IST

26న భారత్‌ బంద్‌

దిల్లీ: వ్యవసాయ చట్టాలపై దిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న రైతు సంఘాలు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 26న పూర్తి స్థాయి భారత్‌ బంద్‌ చేపట్టనున్నట్లు తెలిపాయి. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్‌ బంద్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్‌ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఈ బంద్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అలాగే పెరిగిన చమురు ధరలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న ట్రేడ్‌ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొనున్నట్లు తెలిపారు. మార్చి 29న హోలీకా దహన్‌పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేయనున్నట్లు తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని