close

తాజా వార్తలు

Published : 06/03/2021 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వెనక్కి తగ్గని అన్నదాతలు

దిల్లీ సమీపంలోని రహదారిని దిగ్బంధించిన రైతులు

దిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని, తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని 100 రోజుల క్రితం అన్నదాతలు నిరసనకు దిగారు. తమకు ప్రచారం లేకపోయినా, ఎండాకాలం సమీపిస్తున్నా తాము అనుకున్నది సాధించేవరకూ వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు తేల్చి చెబున్నాయి. అందుకు తగ్గట్టే వందరోజులు పూర్తయిన నేపథ్యంలో..తమ నిరసనను తెలుపుతూ, రైతులు శనివారం ‘బ్లాక్‌ డే’ను పాటిస్తున్నారు. కుంద్లి-మనేసర్-పల్వాల్(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌ వేను ఐదు గంటల పాటు దిగ్బంధించనున్నారు. ఈ క్రమంలో తమకు మద్దతుగా దేశవ్యాప్తంగా కార్యాలయాలు, ఇళ్ల నుంచి నల్లజెండాలు ఊపుతూ నిరసన వ్యక్తం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. 

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న దిల్లీలో ప్రదర్శనకు కోసం తరలివచ్చిన వేలాది కర్షకులు..నగరంలోకి అనుమతి లభించకపోవడంతో సింఘు, టిక్రీ, ఘాజీపుర్‌లలో శిబిరాలు నిర్మించుకొని ధర్నాలు సాగిస్తున్నారు. కేంద్రంతో పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ..రైతులు చట్టాల రద్దుకే వారు పట్టుబట్టడంతో అవి కాస్తా కొలిక్కిరాకుండా పోయాయి. దేశరాజధానిలో జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో కేంద్రం సీరియస్ అయింది. అప్పటి నుంచి ఉద్యమం కాస్త నెమ్మదించింది. ఏదేమైనప్పటికీ.. ఆ చట్టాలను రద్దుచేసే వరకు తాము వెనుదిరగబోమని, ఎన్నాళ్లయినా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ శుక్రవారం స్పష్టం చేశారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని