చలి.. వర్షం.. లెక్కచేయని రైతన్న!

తాజా వార్తలు

Updated : 03/01/2021 13:54 IST

చలి.. వర్షం.. లెక్కచేయని రైతన్న!

దిల్లీ: చలి.. వర్షం.. ప్రకృతిలో భాగమైన ఈ రెండూ రైతన్నకు నేస్తాలే. పంటను చేతికందించడంలో అన్నదాతకు సహకరించేవే. కానీ, రెండూ ఏకమై వచ్చినా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతన్నను మాత్రం కదిలించలేకపోయాయి. కొత్త సాగు చట్టాల రద్దే లక్ష్యంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 39వ రోజుకి చేరింది. సింఘు, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా, పల్వాల్ సరిహద్దుల వద్ద రైతుల నిరసన కొనసాగుతోంది. ఓవైపు వణికించే చలికి నేటి తెల్లవారుజాము నుంచి వర్షం కూడా తోడైంది. అయినా రైతులు లెక్కచేయడం లేదు. గుడారాల్లోకి చేరి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చట్టాల రద్దు చేసే వరకు నిరసన ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.

మరోవైపు సోమవారం కేంద్రంతో  రైతు సంఘాల ఏడో దఫా చర్చలు జరగనున్నాయి. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై చర్చించనున్నారు. ఈసారి చర్చలు సఫలం కాకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని రైతులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే జనవరి 6న ట్రాక్టర్ల ర్యాలీ, జనవరి 26న ట్రాక్టర్లతో కవాతు నిర్వహించాలని నిర్ణయించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని