
తాజా వార్తలు
టీసీఎస్ తొలి సీఈవో ఎఫ్.సి.కోహ్లీ కన్నుమూత
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ తొలి సీఈవో, పద్మభూషణ్ ఎఫ్.సి.కోహ్లీ (96) కన్నుమూశారు. భారత ఐటీ పరిశ్రమ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1969లో టాటా గ్రూప్లో చేరిన ఎఫ్.సి.కోహ్లీ.. 1996 వరకు టీసీఎస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995-96 మధ్య కాలంలో నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) సంస్థకు అధ్యక్షుడిగానూ ఉన్నారు.
తొలుత నేవీలో చేరాలనుకున్నారట..
1924, మార్చి 19న ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న పెషావర్లో జన్మించిన ఎఫ్సీ కోహ్లీ.. అక్కడే పాఠశాల విద్యనభ్యసించారు. లాహోర్లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాతో పాటు గోల్డ్ మెడల్ సాధించారు. తొలుత ఆయన భారత నేవీలో చేరాలనుకున్నారట. కానీ అదే సమయంలో విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్షిప్కు దరఖాస్తు చేశారట. స్కాలర్షిప్ రావడంతో కెనడాలోని క్వీన్స్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. దీంతో అక్కడే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీఎస్సీ (ఆనర్స్) పూర్తి చేశారు. ఏడాది పాటు కెనడియన్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేశారు. ఆ తరవాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లోనే ఎంఎస్ పూర్తిచేశారు. 1951లో భారత్కు తిరిగి వచ్చిన ఆయన.. 1969లో టాటా గ్రూపులో చేరారు. ఎఫ్.సి. కోహ్లీ మరణం పట్ల టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే, నాస్కామ్ కూడా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తంచేసింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
