DRDO: రక్షణ పరికరాల తయారీకి కీలక ముందడుగు!
close

తాజా వార్తలు

Published : 13/06/2021 23:38 IST

DRDO: రక్షణ పరికరాల తయారీకి కీలక ముందడుగు!

దిల్లీ: ఆయుధాలు, రక్షణ పరికరాల దేశీయ తయారీకి మరింత ఊతమిచ్చేలా కీలక ముందడుగు పడనుంది. భారత్  దేశీయంగా రూపొందించనున్న అణ్వాయుధ దాడి సామర్ధ్యం గల మూడు జలాంతర్గాముల నిర్మాణంలో 95 శాతం భారత్‌ తయారీ వస్తువులనే వినియోగించనున్నారు. రూ.50 వేల కోట్లతో ఈ మూడు జలాంతర్గాముల తయారీ ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపే అంశాన్ని పరిశీలిస్తోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ(డీఆర్‌డీఓ)కు చెందిన విశాఖపట్నం కేంద్రంలో వీటిని తయారు చేస్తారు. త్వరలోనే ఈ జలాంతర్గాముల సంఖ్యను ఆరుకు పెంచనున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు సహా దేశీయ రక్షణ రంగానికి వీటి తయారీ ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలతో, ఆర్థిక వ్యవస్ధకు కూడా మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. విదేశాల నుంచి ఎలాంటి సహాయం తీసుకోకుండా వీటి నిర్మాణాన్ని పూర్తి చేయగలమని డీఆర్‌డీఓ నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించాయి. ఒక వేళ ఆ అవసరం వస్తే వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల నుంచి తీసుకుంటాయని తెలిపాయి. బాలిస్టిక్  క్షిపణులను ప్రయోగించగల ఆరు అణ్వాయుధ దాడి సామర్ధ్య  జలాంతర్గాముల ప్రాజక్టు తయారీ కోసం ఉద్దేశించిన అరిహంత్ రకం ప్రాజక్టుకు ఇది అదనం.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని