Pak Army vs ISI: పాక్‌ ఆర్మీ-ఐఎస్ఐ బాస్‌ల మధ్య ఆధిపత్య పోరు..!

తాజా వార్తలు

Published : 22/09/2021 16:02 IST

Pak Army vs ISI: పాక్‌ ఆర్మీ-ఐఎస్ఐ బాస్‌ల మధ్య ఆధిపత్య పోరు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌పై పెత్తనం చేసే విషయంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వాకు ఆ దేశ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ మధ్య వర్గపోరు జరుగుతోంది. ఒక దశలో జనరల్‌ బజ్వా ఐఎస్‌ఐ చీఫ్‌ను పదవి నుంచి తప్పించేందుకు కూడా ప్రయత్నించారు. కానీ, ఫయాజ్‌కు ఆ దేశ నిఘా సంస్థపై ఉన్న పట్టుకారణంగా అది సాధ్యం కాలేదు. 

కొన్నేళ్ల నుంచి ఐఎస్‌ఐ తాలిబన్లను కాపాడుకొంటూ వస్తోంది. వారిని పాక్‌ అవసరాలకు తగినట్లు అఫ్గాన్‌లో ఆపరేషన్లకు వినియోగించుకొంది. తాజాగా అఫ్గాన్‌లో తాలిబన్లు పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు పాక్‌ ఆర్మీ కూడా అఫ్గాన్‌పై తన ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆర్మీ చీఫ్‌ తన వ్యక్తిగత అజెండా అమలుకు తాలిబన్లకు అప్పగించాలని చూడగా.. ఐఎస్‌ఐ చీఫ్‌ అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. 

సెప్టెంబర్‌ 4వ తేదీన ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ ఫయాజ్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వాకు వెల్లడించకుండానే కాబుల్‌కు వెళ్లారు. అక్కడ తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు చేసి వచ్చారు. దీంతో  జనరల్‌ మహమ్మద్‌ అమీర్‌ స్పందించారు. నిబంధనల ఉల్లంఘనకు సమాధానం ఇచ్చేందుకు తన ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో ఫయాజ్‌ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంతో ఆయనతో అవమానకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఆయన వాహనంపై ఉన్న ఐఎస్‌ఐ జెండాను కూడా ముందే తొలిగించారు. విచారణ సందర్భంగా ఫయాజ్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. 

ఐఎస్‌ఐకు తాలిబన్లలోని గ్రూపులతో బలమైన సంబంధాలు ఉన్నాయి. వీటిల్లో హక్కానీ నెట్‌వర్క్‌ కూడా ఉంది. ఐఎస్‌ఐ మనుషులు అఫ్గాన్‌ వార్‌లార్డ్స్‌ వద్ద, కీలక వ్యక్తుల వద్ద పనిచేస్తున్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని