ధరలు అదుపులో ఉంచేందుకే వాటిపై జీఎస్టీ
close

తాజా వార్తలు

Published : 09/05/2021 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధరలు అదుపులో ఉంచేందుకే వాటిపై జీఎస్టీ

దిల్లీ: కరోనా వ్యాక్సిన్లపైనా, మెడికల్‌ ఆక్సిజన్‌పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దు చేయాలంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. వ్యాక్సిన్‌ (5 శాతం పన్ను), ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల (12 శాతం పన్ను) ధరలను అదుపులో ఉంచేందుకే జీఎస్టీ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె వరుస ట్వీట్లు చేశారు.

ఆయా వస్తువులకు ఒకవేళ జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే.. దేశీయ తయారీదారులు ముడిపదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని, తద్వారా వినియోగదారుడిపైనే భారం పడుతుందని సీతారామన్‌ వివరించారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, దాని ముడిపదార్థాలు వంటి ఔషధాలపై దిగుమతి సుంకాలు, ఐజీఎస్టీని తగ్గించినట్లు వివరించారు. సంబంధిత ఔషధాల జాబితాను కూడా ట్వీట్‌ చేశారు. 45+ వయసున్న వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయిస్తోందని, దానికి కేంద్రమే పన్ను చెల్లిస్తోందని తెలిపారు. తద్వారా వసూలైన జీఎస్టీ మొత్తంలో సగం మళ్లీ రాష్ట్రాలకే వెళుతోందని గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని