Afghanistan crisis: ఆడపిల్లల ఆధారాలు కనపడకుండా  పాఠశాల రికార్డులు కాల్చేశారు!

తాజా వార్తలు

Published : 22/08/2021 20:30 IST

Afghanistan crisis: ఆడపిల్లల ఆధారాలు కనపడకుండా  పాఠశాల రికార్డులు కాల్చేశారు!

కాబుల్‌: తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఏ క్షణానా ఏం జరుగుతుందోనని జనం భయం గుప్పిట్లో బతుకున్నారు. తాలిబన్ల గత పాలనలో చేసిన ఆరాచకాలను గుర్తు చేసుకుంటూ ఆందోళన చెందుతున్నారు. తాజాగా తాలిబన్ల చెర నుంచి ఆడపిల్లలను రక్షించడానికి ఓ పాఠశాల వ్యవస్థాపకురాలు రికార్డులు తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.

షబానా బసిజ్-రసిక్ అనే మహిళ అఫ్గాన్‌లో ఆల్-గర్ల్స్ బోర్డింగ్ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. పాఠశాలకు వచ్చిన బాలికల వివరాలు తెలుసుకొని వారిపై తాలిబన్లు దాడికి పాల్పడతారనే ఉద్దేశంతో వారి ఆధారాలు కనపడకుండా కాల్చేశారు. దీన్ని ఓ వీడియోలో చిత్రించి తన ట్విటర్‌ ఖాతాలో పొందుపరిచారు.

‘నా స్కూల్లో చదువుకున్న బాలికల రికార్డులను కాల్చేస్తున్నాను. తాలిబన్ల చెర నుంచి బాలికలతో పాటు వారి కుటుంబ సభ్యులను రక్షించడానికే ఇలా చేశాను’ అని షబానా ట్వీట్‌లో పేర్కొన్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత మళ్లీ తాలిబన్లు అఫ్గన్‌ను తిరిగి ఆక్రమించారు. వారు షరియా చట్టాన్ని అమలులోకి తెస్తే మహిళలు స్వేచ్ఛగా జీవించలేరని ఆవేదన వ్యక్తం చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని