Chhattisgarh: రాయ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో పేలుడు.. జవాన్లకు గాయాలు

తాజా వార్తలు

Published : 16/10/2021 15:49 IST

Chhattisgarh: రాయ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో పేలుడు.. జవాన్లకు గాయాలు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్  రైల్వేస్టేషన్‌లో స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయి. డిటోనేటర్లు, హెచ్‌డీ కాట్రిడ్జ్ వంటి మందుగుండు సామగ్రితో కూడిన కంటైనర్‌ను రైలులోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి పేలుడు సంభవించింది. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు అక్కడే ఆగి ఉండటంతో జవాన్లకు గాయాలయ్యాయి.

సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు ఒడిశాలోని ఝర్సుగూడ నుంచి జమ్ముకు వెళ్తోంది. ఉదయం ఆరున్నర సమయంలో రాయ్‌పూర్‌ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు గాయపడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని