Free WiFi: ఆప్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. ఉచిత వైఫై సేవలు పొడిగింపు!

తాజా వార్తలు

Published : 03/08/2021 20:46 IST

Free WiFi: ఆప్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. ఉచిత వైఫై సేవలు పొడిగింపు!

దిల్లీ: దేశ రాజధాని నగర ప్రజలకు గుడ్‌ న్యూస్‌! ప్రపంచంలోనే తొలిసారి దిల్లీ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఉచిత వైఫై సేవల పథకాన్ని ఆప్‌ సర్కార్‌ పొడిగించింది. ఈ మేరకు దిల్లీ కేబినెట్‌ ఆమోదముద్ర వేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 10,561 వైఫై హాట్‌ స్పాట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. నగర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచిత వైఫై సేవలు అందించడంలో ప్రపంచంలోనే తొలినగరంగా దిల్లీ నిలవడం విశేషం. నాణ్యమైన వైఫై సేవలను ఉచితంగా అందించే పథకానికి ఏడాది విజయవంతంగా పూర్తికావడంతో దీన్నిపొడిగించాలన్న ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించినట్టు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. 

2019 డిసెంబర్‌లో తొలిసారి ఉచిత వైఫై పథకాన్ని సీఎం కేజ్రీవాల్‌ ఐటీఓ బస్టాండ్‌ నుంచి ప్రారంభించారు. దిల్లీలో 11వేల హాట్‌ స్పాట్‌లు ఏర్పాటు చేయాలని ఆప్‌ సర్కార్‌ లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఇప్పటికే  10,561 చోట్ల హాట్‌స్పాట్‌లను అమర్చినట్టు పేర్కొంది. వీటిలో 2208 హాట్‌ స్పాట్‌లు బస్‌ స్టాప్‌లలోనే ఏర్పాటు చేయగా.. మిగతావన్నీ నగరంలోని పలుచోట్ల అమర్చారు. ప్రతి 500 మీటర్ల వరకు ప్రజలు వైఫై సేవలు పొందే అవకాశం ఉంది. ఒకేసారి 21లక్షలకు పైగా ప్రజలు 100 నుంచి 200 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలు పొందేలా ఉచిత వైఫై పథకం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో వ్యక్తికి నెలకు 15 జీబీ డేటాను ఉచితంగా అందిస్తుండగా.. రోజుకు గరిష్టంగా 1.5 జీబీ డేటాను పొందేందుకు వీలు కల్పిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని