హెలికాప్టర్‌ ప్రమాదంలో ఒలివియర్‌ డస్సాల్ట్‌ మృతి
close

తాజా వార్తలు

Updated : 08/03/2021 06:39 IST

హెలికాప్టర్‌ ప్రమాదంలో ఒలివియర్‌ డస్సాల్ట్‌ మృతి

ప్యారిస్‌: ఫ్రెంచ్‌ బిలియనీర్‌, ఎంపీ ఒలివియర్‌ డస్సాల్ట్‌ ‌(69) హెల్‌కాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు. వాయువ్య ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో ఆ దేశ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు హెలికాప్టర్‌ కుప్పకూలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో పైలెట్‌ కూడా చనిపోయాడు. ఒలివియర్‌ మృతిపట్ల ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో పైలెట్‌తో పాటు ఒలివియర్‌ ఒక్కరే ఉన్నారు. 

ఒలివియర్‌ తాత మార్సెల్‌ డస్సాల్ట్‌ ప్రపంచంలో పేరొందిన డస్సాల్ట్‌ ఏవియేషన్‌ను నెలకొల్పారు. భారత్‌కు రఫేల్‌ యుద్ధవిమానాలు తయారు చేసి అందించింది కూడా వీరి సంస్థే.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని