కెంపెగౌడ విమానాశ్రయానికి సబర్బన్‌ రైలు సేవలు

తాజా వార్తలు

Updated : 04/01/2021 23:59 IST

కెంపెగౌడ విమానాశ్రయానికి సబర్బన్‌ రైలు సేవలు

బెంగళూరు:  బెంగళూరు సిటీ శివార్లలో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం నుంచి సబర్బన్‌(ఎంఎంటీఎస్‌) రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు, బస్సులు, ట్యాక్సీల ద్వారా .. విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.  దీంతో వారికి రూ.250 వరకు ఛార్జీలు అవుతున్నాయి.  ఈ క్రమంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం స్థానిక దేవనహళ్లి రైల్వేస్టేషన్‌ నుంచి విమానాశ్రయం హాల్ట్‌ వరకు సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే ఆధ్వర్యంలో సబర్బన్‌ రైళ్లను ప్రారంభించారు. 

  ‘ప్రయాణికులు నేరుగా దేవనహళ్లి స్టేషన్‌ నుంచి రైలులో  కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి  చేరుకోవచ్చు.  సిటీ రైల్వే స్టేషన్ అనుసంధానంతో విమానాశ్రయానికి సబర్బన్‌ రైళ్లను నడుపుతున్నారు’ అని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సోమవారం ట్వీటర్‌ ద్వారా తెలిపారు.  కేఐవీకి రైలు సేవలు ప్రారంభించడంతో  లక్షల మంది ప్రయాణికులకు మేలు జరుగుతుంది.  ట్రాఫిక్‌ కూడా తగ్గుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు.

   ‘కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం. సిటీ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.  తొలిసారి రైలు సేవలు ప్రారంభిచడంతో  ప్రయాణికులకు కేవలం రూ.10-15 మాత్రమే ఖర్చవుతుంది.  కొద్ది నెలల్లో అయిదు జతల సబర్బన్‌ రైళ్లను సిటీ, విమానాశ్రయాల మధ్య నడపనున్నారు.  కేవలం రూ.10 వెచ్చించి విమానాశ్రయానికి చేరుకోవచ్చు’అని సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే జనరల్ మేనేజర్‌, ప్రజా వ్యవహారాల ముఖ్యాధికారి విజయ తెలిపారు.    

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని