పేలిన గ్యాస్‌ పైపులైన్‌: 12 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 15:10 IST

పేలిన గ్యాస్‌ పైపులైన్‌: 12 మంది మృతి

బీజింగ్‌: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్‌ చైనాలోని హుబే వద్ద గ్యాస్‌ పైపులైన్‌ పేలడంతో 12 మంది మృత్యువాతపడ్డారు. మరో 100మంది వరకూ గాయపడినట్లు సమాచారం. జాంగ్వాన్‌ జిల్లా షియాన్‌ నగరంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.30గం.లకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ పైపులైన్‌ పేలిన వెంటనే అక్కడికక్కడే 12మంది చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని 150మందిని రక్షించారు. గాయపడిన వారిలో 39మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని