అతను ‘సూట్‌ వేసుకున్న ఉగ్రవాది’ 

తాజా వార్తలు

Updated : 06/01/2020 04:11 IST

అతను ‘సూట్‌ వేసుకున్న ఉగ్రవాది’ 

 

దుబయ్‌: ఇరాన్‌ అగ్రశ్రేణి సైనికాధికారి మేజర్‌ జనరల్‌ సులేమానీని అమెరికా డ్రోన్‌ దాడితో హతమార్చిన నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన సమాచారశాఖ మంత్రి మహమ్మద్‌ జవాద్‌ అజారీ జహ్రోమి ట్విటర్‌ వేదికగా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూట్‌ వేసుకున్న ఉగ్రవాది అని మంత్రి పేర్కొన్నారు. ట్రంప్‌ కూడా ఐసీస్‌, హిట్లర్‌, చెంగిస్‌ఖాన్‌ల సంతతికి చెందిన వాడేనని అన్నారు. 51 ఇరాన్‌ స్థావరాలపై దాడులను అమెరికా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అయితే, అంతే వేగంగా అదే స్థాయిలో ఇరాన్‌ స్పందన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడులకు పాల్పడుతున్న అమెరికాకు యుద్ధం చేసే దమ్ము లేదని మరో సైనికాధికారి మేజర్‌ జనరల్‌ అబ్దుల్‌ రహీం మౌసావి ఎద్దేవా చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని